కాంగ్రెస్‌కు ఆ సత్తా ఉందా.. | Congress has the opportunity .. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఆ సత్తా ఉందా..

Apr 15 2014 3:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు ఆ సత్తా ఉందా.. - Sakshi

కాంగ్రెస్‌కు ఆ సత్తా ఉందా..

రైల్వేకోడూరురూరల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను పెట్టుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉందా అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు.

రైల్వేకోడూరురూరల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను పెట్టుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉందా అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ అతిథిగృహంలో సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి ఈ ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని జోస్యం తెలిపారు. రాష్ట్ర విభజనకు కారుకులైన బీజేపీకి, టీడీపీకి ఓట్లు వేస్తే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్లే అన్నారు. గత ఉప ఎన్నికలకంటే ఈ ఎన్నికలలో తిరుగులేని, చ రిత్రలో నిలిచిపోయే మెజార్టీని ప్రజలు ఇస్తారన్నారు.

 ైవె ఎస్సార్ సీపీది ప్రజా మేనిఫెస్టో

వైఎస్సార్ సీపీ అదినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో అని, అది ప్రజల మేనిఫెస్టో అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డిలు అన్నారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోను చూసిన ప్రతి ఒక్కరూ ఇది తమ ఇంటి మేనిఫెస్టో అంటున్నారన్నారు. రైతులకు పగలు ఏడు గంటల వ్యవసాయ విద్యుత్, ప్రతి ఇంటికి రూ.100కే కరెంటు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు. రానున్నది వైఎస్సార్ స్వర్ణయుగం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓబులవారిపల్లె మండల కన్వీనర్ సాయికిషోర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కమతం నాగరాజు యాదవ్, జిల్లా మహిళా విభాగం నాయకులు మారెళ్ల రాజేశ్వరి, వార్డు మెంబరు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement