2050కి నంబర్‌వన్‌ రాష్ట్రంగా ఏపీ: సీఎం | Cm chandrababu says ap will be the number one at the year 2050 | Sakshi
Sakshi News home page

2050కి నంబర్‌వన్‌ రాష్ట్రంగా ఏపీ: సీఎం

Jan 11 2018 1:10 AM | Updated on Aug 14 2018 11:26 AM

Cm chandrababu says ap will be the number one at the year 2050 - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: మూడు విజన్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో, 2050 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపేందుకు విజన్‌తో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కన్నా రాష్ట్ర అభివృద్ధి 5.57 శాతం అధికంగా ఉందని చెప్పారు.

వ్యవసాయంలో బాగా అభివృద్ధి సాధించామన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్వరలో రెండు లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రుణాల్ని ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి ఇస్తామన్నారు. రానూపోనూ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement