'పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారు' | YSRCP MLA Bhuma nagireddy takes on union, ap governments | Sakshi
Sakshi News home page

'పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారు'

Oct 24 2015 8:07 PM | Updated on Mar 23 2019 9:10 PM

'పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారు' - Sakshi

'పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారు'

కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసి ప్రజల నోట్లో మట్టికొట్టాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు.

కర్నూలు: కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసి ప్రజల నోట్లో మట్టికొట్టాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారని అన్నారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదని భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు ఆడంబరంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement