రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | youth died in road accident in ranagareddy district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Nov 15 2015 12:15 PM | Updated on Sep 18 2019 3:24 PM

రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. మహేశ్వరం మండలం సర్థార్ నగర్ గేట్ వద్ద  కారు టైరు పేలడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్‌పై  వెళుతున్న ముగ్గురు యువకుల్లో ఆనంద్(28) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement