మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం | women conistable committed suicide in nizamabad district | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

Dec 4 2015 9:04 PM | Updated on Nov 6 2018 7:56 PM

నిజామాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇందిర (28) శుక్రవారం బలవన్మరణం చెందింది.

నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇందిర (28) శుక్రవారం బలవన్మరణం చెందింది. నిజామాబాద్ రూరల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ఆమెకు ఆరు నెలల క్రితం వివాహమైంది.

భర్తతో తలెత్తుతున్న మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల కిందట విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయింది. మనోవేదనతోనే ఇందిర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement