రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | two dies of road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

May 19 2017 11:24 PM | Updated on Aug 30 2018 4:10 PM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు.

తాడిపత్రి టౌన్‌ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. తాడిపత్రిలోని  సీబీ రోడ్డులో లారీ ఢీకొని కావేటిసముద్రం గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి(45) అనే వ్యాపారి మృతిచచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన బతుకుదెరువు కోసం స్వగ్రామం వదిలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. నాటి మధ్యామ్నం ‍వ్యాపార నిమిత్తం బైక్‌లో బయలుదేరగా ఎదురొచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.  

కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో మరొకరు..
చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జువారి సీడ్స్‌ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ప్రమాదంలో టాటా ఏస్‌ ఆటో డ్రైవర్‌ ఖాదర్‌(45) మరణించినట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు. మాంసం వ్యర్థాల లోడుతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో జువారి సీడ్స్‌ వద్దకు రాగానే చెడిపోయిందన్నారు. దీంతో ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని నిలబెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఖాళీ సిలిండర్లతో బెంగళూరు వైపునకు బయలుదేరి వచ్చిన ఈచర్‌ వాహనం వెనుక వైపు నుంచి ఆటోను ఢీకొనడంతో ఖాదర్‌ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతన్ని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement