తుని ఘటనలో నలుగురికి బెయిల్ | tuni insident : four got bail by petapuram court | Sakshi
Sakshi News home page

తుని ఘటనలో నలుగురికి బెయిల్

Jun 17 2016 4:55 PM | Updated on Jul 30 2018 7:57 PM

తుని ఘటనలో అరెస్టైయిన వారిలో నలుగురికి పిఠాపురం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

తుని(తూ.గో):తుని ఘటనలో అరెస్టయిన వారిలో నలుగురికి పిఠాపురం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. పుల్లయ్య, సత్తిబాబు, లగుడు నివాస్, పల్ల హరిబాబులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ముద్రగడ మాత్రం వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement