లైంగిక వేధింపుల విచారణకు త్రిసభ్య కమిటీ | Tri members committee on sexual harassment issue | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల విచారణకు త్రిసభ్య కమిటీ

Oct 25 2016 11:02 PM | Updated on Jul 23 2018 9:15 PM

నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అంగడి రాజేష్‌ తనను..

నెహ్రూనగర్‌ : నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అంగడి రాజేష్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు నగర కమిషనర్‌కు, డీఎంఏ కార్యాలయానికి పోస్ట్‌ ద్వారా ఫిర్యాదు చేయడం విదితమే. దీనిపై విచారణకు ప్రజారోగ్యాధికారి నాగేశ్వరరావును కమిషనర్‌ నియమించారు. విచారణ జరుగుతుండగానే మరో ముగ్గురు అధికారులను సమగ్ర విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీగా కమిషనర్‌ నాగలక్ష్మి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో∙డిప్యూటీ కమిషనర్‌ ఏసుదాసు, శానిటరీ సూపర్‌ వైజర్‌ రాజ్యలక్ష్మి, సెక్రటరీ వసంతలక్ష్మిని ప్రత్యేక కమిటీగా నియమించారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించి బుధవారం సాయంత్రానికి తనకు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement