పనులన్నీ పూర్తి కావాల్సిందే | total works tobe completed | Sakshi
Sakshi News home page

పనులన్నీ పూర్తి కావాల్సిందే

Aug 10 2016 12:29 AM | Updated on Sep 4 2017 8:34 AM

కొల్లాపూర్‌ రూరల్‌ : సోమశిల వీఐపీ ఘాట్‌లో కృష్ణా నీటిని తలపై చల్లుకుంటున్న మంత్రులు

కొల్లాపూర్‌ రూరల్‌ : సోమశిల వీఐపీ ఘాట్‌లో కృష్ణా నీటిని తలపై చల్లుకుంటున్న మంత్రులు

జిల్లాలో బుధవారంలోగా అన్ని పుష్కరఘాట్‌ పనులు పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని పుష్కరఘాట్‌ పనులను వారు పరిశీలించారు. వీఐపీ ఘాట్‌లో పనులు నత్తనడకన ఉన్నాయని మండిపడ్డారు. అనంతరం సోమేశ్వరాలయంలో సోమేశ్వరున్ని దర్శించుకుని పూజలు చేసి ఆవరణలో మొక్కలు నాటారు.

 
 
– సోమశిల పుష్కరఘాట్ల పరిశీలన
 
కొల్లాపూర్‌ రూరల్‌ : జిల్లాలో బుధవారంలోగా అన్ని పుష్కరఘాట్‌ పనులు పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని పుష్కరఘాట్‌ పనులను వారు పరిశీలించారు. వీఐపీ ఘాట్‌లో పనులు నత్తనడకన ఉన్నాయని మండిపడ్డారు. అనంతరం సోమేశ్వరాలయంలో సోమేశ్వరున్ని దర్శించుకుని పూజలు చేసి ఆవరణలో మొక్కలు నాటారు. పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేసిన ప్లాట్‌ఫామ్‌ను పరిశీలించారు. అనంతరం వీఐపీఘాట్‌ వద్ద కృష్ణానీటిని తలపై పోసుకుని ఆనందం వ్యక్తంచేశారు. సోమశిల దగ్గర కృష్ణానదిలో టూరిజం లాంచీలో మంత్రులు ప్రయాణం చేసి నల్లమల అందాలను వీక్షించారు. ఈ కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సర్పంచ్‌ వెంకటస్వామి, సింగిల్‌విండో చైర్మన్‌ రఘుపతిరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహారావు, రాజేష్‌; మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఎక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement