తొలుత రూ.95.19 లక్షలు విడుదల
అదనంగా మరో రూ.6.27 లక్షలు విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు ఏప్రిల్ 21 నుంచి 27 వరకు వారం రోజులపాటు సింగపూర్లో పర్యటించిన విషయం తెలిసిందే. వారి పర్యటనకు రూ.1.01 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రులు సింగపూర్ పర్యటనకు తొలుత రూ.95.19 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మరో రూ.6.27 లక్షల అదనపు బడ్జెట్‌ను విడుదల చేస్తూ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రుల సింగపూర్ పర్యటనకు రూ.1.01 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేశారు.


