బైక్‌ను ఢీకొట్టిన లారీ: ముగ్గురి మృతి | Three die in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ముగ్గురి మృతి

Oct 13 2016 3:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

రామాయంపేట (మెదక్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement