ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు | thieves lifted hundi from temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

Oct 7 2016 10:03 AM | Updated on Sep 4 2017 4:32 PM

ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు.

ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో సొత్తు ఎంత ఉంటుందనే తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement