తహసీల్దార్‌ బదిలీ.. టపాసులు పేల్చి సంబరాలు! | Villagers Celebrate Tahsildar's Transfer at Karimnagar | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ బదిలీ.. టపాసులు పేల్చి సంబరాలు!

Jun 18 2026 11:46 AM | Updated on Jun 18 2026 12:23 PM

చిగురుమామిడి: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల తహసీల్దార్‌ ముద్దసాని రమేశ్‌ మంగళ వారం బదిలీ కాగా.. బుధ వారం ఆఫీస్‌ ఎదుట బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి, సంబరాలు జరుపుకొన్నారు. తహసీల్దార్‌ రమేశ్‌ భూ రిజిస్ట్రేషన్లు, ఇండ్ల అనుమతులు, నాలా కన్వర్జేషన్‌ విషయాల్లో చేతివాటం ప్రదర్శించాడని బీఎస్పీ మండలశాఖ అధ్యక్షుడు ఎనగందుల శ్రవన్‌కుమార్‌ ఆరోపించారు. ఎన్నిసార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అవినీతి అధికారి బదిలీ కావడంతో సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement