ఆలయంలో చోరీకి యత్నం | Thieves attempt to robbery in guntur district | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీకి యత్నం

Oct 4 2015 11:50 AM | Updated on Aug 28 2018 7:30 PM

గుంటూరు జిల్లా పాలెం మండలం కాజీపాలెం గ్రామంలో పలు దేవాలయాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు యత్నించారు.

పాలెం(గుంటూరు): గుంటూరు జిల్లా పాలెం మండలం కాజీపాలెం గ్రామంలో పలు దేవాలయాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు యత్నించారు. స్థానికులు గుర్తించడంతో.. అక్కడినుంచి ఉడాయించారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలలో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేసి ఆలయ తలుపులు పగలగొట్టారు. ఆ సమయంలో శబ్ధం రావడంతో.. గమనించిన స్థానికులు అప్రమత్తమవడంతో.. దుండగులు పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement