ఇంట్లో చోరీ | theft in house | Sakshi
Sakshi News home page

ఇంట్లో చోరీ

May 12 2017 11:03 PM | Updated on Aug 11 2018 6:04 PM

మండలంలోని కొత్తపేట గ్రామంలో మస్తాన్‌ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఉక్కపోతగా ఉండటంతో కుటుంబసభ్యులంతా ఇంటి ఆవరణలో నిద్రించారు.

గుత్తి రూరల్‌ : మండలంలోని కొత్తపేట గ్రామంలో మస్తాన్‌ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఉక్కపోతగా ఉండటంతో కుటుంబసభ్యులంతా ఇంటి ఆవరణలో నిద్రించారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు,  రెండు తులాల వెండి పట్టీలు, రూ.5 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement