పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం | The water level rising | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

Aug 6 2016 12:45 AM | Updated on Aug 1 2018 3:59 PM

: నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది

 
 
 
బాల్కొండ : నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వార 4,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వార 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 50 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార 100 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వార నీటి విడుదలతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వార 11.6 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.00(47.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement