రుణ భారంతో రైతు బలవన్మరణం | the farmer commits suicide | Sakshi
Sakshi News home page

రుణ భారంతో రైతు బలవన్మరణం

Jul 17 2016 8:10 PM | Updated on Oct 8 2018 5:07 PM

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం చెన్నారంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈ గ్రామానికి చెందిన పూరుమాల జైపాల్‌రెడ్డి (28) ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఏడెకరాల్లో మొక్కజొన్న వేశాడు. మరో రెండెకరాల్లో వరిసాగు చేసేందుకు నారు పోశాడు. ఉన్న ఒక్క బోరులో నీళ్లు తగ్గిపోవడంతో అప్పు చేసి ఇటీవల మరో మూడు బోర్లు వేయించినా ప్రయోజనం దక్కకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement