గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య

Sep 23 2016 1:51 PM | Updated on May 3 2018 3:20 PM

జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ గంటరాయి గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ గంటరాయి గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వంతాల చందర్‌రావు(25), బాలన్న(35) బావాబామ్మర్థులు. వీరి మధ్య భూమి విషయంలో ఈ మధ్య గొడవ జరుగుతోంది. అలాగే వీరి పొలం వద్ద భూమి దున్నుతుండగా శుక్రవారం గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన బాలన్న, చందర్‌రావును గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చందర్‌రావు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలాన్ని సీఐ విజయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement