breaking news
Chander Rao
-
ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంట చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చందర్రావుతో సర్దుబాటు చేసుకునేందుకు మల్లయ్యయాదవ్ గురువారం ఆయన ఇంటికి వెళ్లారు బొల్లం వెంట అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మునగాల మండల నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేశ్ తదితరులు ఉన్నారు. ఇంటిలోపలే ఉన్న చందర్రావు తన ఇంటికి ఎమ్మెల్యే బొల్లం వచ్చారని చెప్పినా గది నుంచి బయటికి రాలేదు. దీంతో హాల్లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూశారు. అప్పటికీ చందర్రావు బయటికి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. -
గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య
జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ గంటరాయి గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వంతాల చందర్రావు(25), బాలన్న(35) బావాబామ్మర్థులు. వీరి మధ్య భూమి విషయంలో ఈ మధ్య గొడవ జరుగుతోంది. అలాగే వీరి పొలం వద్ద భూమి దున్నుతుండగా శుక్రవారం గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన బాలన్న, చందర్రావును గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చందర్రావు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలాన్ని సీఐ విజయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.