స్వల్పంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

Feb 9 2017 10:14 PM | Updated on Mar 28 2019 6:27 PM

జిల్లాలో కొన్ని మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా, మరికొన్నింటిలో పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది.

– అగళిలో 10.5 డిగ్రీల కనిష్టం
– శింనగమలో 39.9 డిగ్రీల గరిష్టం
అనంతపురం అగ్రికల్చర్‌ :
జిల్లాలో కొన్ని మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా, మరికొన్నింటిలో పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. గురువారం అగళిలో 10.5 డిగ్రీలు, మడకశిర 11 డిగ్రీలు, రొద్దం 12 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 12 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

శింగనమలలో 36.9 డిగ్రీలు, గుంతకల్లు 36.4 డిగ్రీలు, కొత్తచెరువు, తాడిమర్రి, యల్లనూరులో 36.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా  మిగిలిన మండలాల్లో 32 నుంచి 36 డిగ్రీల వరకు కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం పూట 60 నుంచి 80 శాతం ఉండగా మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement