అగళిలో 10.8 డిగ్రీల కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

అగళిలో 10.8 డిగ్రీల కనిష్టం

Feb 8 2017 9:49 PM | Updated on Mar 28 2019 6:27 PM

జిల్లాలో కొన్ని మండలాల్లో రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలో చలితీవ్రత కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు ప్రారంభమయ్యాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో కొన్ని మండలాల్లో రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలో చలితీవ్రత కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు ప్రారంభమయ్యాయి. బుధవారం అగళి మండలంలో 10.8 డిగ్రీల కనిష్టం నమోదు కాగా... తనకల్లు 11 డిగ్రీలు, మడకశిర 11.3 డిగ్రీలు, రొద్దం 12.3 డిగ్రీలు, నల్లమాడ 12.8 డిగ్రీలు, సోమందేపల్లి 12.8 డిగ్రీలు, లేపాక్షి 13.5 డిగ్రీలు, గాండ్లపెంట 13.7 డిగ్రీలు, పుట్లూరు 13.8 డిగ్రీలు కొనసాగాయి.

మిగతా మండలాల్లో 14 నుంచి 21 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతల విషయానికి వస్తే స్వల్పంగా పెరిగి జిల్లా అంతటా 30 నుంచి 35 డిగ్రీల వరకు కొనసాగాయి. గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టింది. ఉదయం పూట 55 నుంచి 75, మధ్యాహ్నం 18 నుంచి 28 శాతం మధ్య రికార్డయింది. గంటకు 5 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement