ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం | st girls school sart | Sakshi
Sakshi News home page

ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం

Aug 5 2016 11:29 PM | Updated on Nov 9 2018 5:02 PM

కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌పహాడ్‌పై ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల సమీపంలోని ఒక భవనంలో శుక్రవారం ఎస్టీ బాలికల గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌ రూరల్‌ : కాగజ్‌నగర్‌లోని  త్రిశూల్‌పహాడ్‌పై  ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల సమీపంలోని ఒక భవనంలో శుక్రవారం ఎస్టీ బాలికల గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు.  ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలకు భవన నిర్మాణానికై రూ. 4.25లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే స్థల సేకరణకై అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.
          అనంతరం ఈ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం 5, 6వ తరగతులు బోధిస్తారని,  రాబోయే కాలంలో  5నుంచి ఇంటర్మీడియేట్‌ వరకు బోధిస్తారని తెలిపారు. ప్రస్తుతం 5, 6వ తరగతులల్లో 120 మంది ఎస్టీ బాలికలకు ప్రవేశం కల్పిస్తారన్నారు.
             ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీపీ విద్యావతి, డిస్టిక్‌ కో ఆర్డినేట్‌ ఆఫీసర్‌  రమేశ్, ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.మారుతి కుమార్, నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్‌ చక్రపాణి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్, ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఎసై ్స ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement