ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం | Sri madbhagavatha Sapthaham ends | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం

Sep 16 2016 10:55 PM | Updated on Sep 4 2017 1:45 PM

ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం

ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం

వందో∙ఏట నిర్విఘ్నంగా నిర్వహించిన శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ శతవర్ష మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. కొల్లూరు వేణుగోపాలస్వామి ఆలయంలో శంకర సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా భాగవత సప్తాహం, పారాయణం వంటి పలు కార్యక్రమాలు జరిగాయి.

కొల్లూరు: వందో∙ఏట నిర్విఘ్నంగా నిర్వహించిన శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ శతవర్ష మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. కొల్లూరు వేణుగోపాలస్వామి ఆలయంలో శంకర సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా భాగవత సప్తాహం, పారాయణం వంటి పలు కార్యక్రమాలు జరిగాయి. చివరిరోజైన శుక్రవారం మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి, దుర్భా శ్రీరామచంద్రమూర్తి సప్తాహం, పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీమద్భాగవత సప్తాహ సావనీరును ప్రముఖుల ఆధ్వర్యంలో శంకర సేవాసమితి సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు భాగవతుల మధుసూదనశర్మ, కల్లూరి వెంకటసూర్యనారాయణమూర్తి, పోలేపెద్ది కామశాస్త్రి, భాగవతుల సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement