పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.
తన సోషల్ మీడియా పోస్ట్‌లో " ఇరాన్‌లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.
కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్‌ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది.
"We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf
— The White House (@WhiteHouse) March 20, 2026


