సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా జట్ల ఎంపిక | senior ball badminton district team elect | Sakshi
Sakshi News home page

సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా జట్ల ఎంపిక

Nov 23 2016 11:07 PM | Updated on Jun 1 2018 8:39 PM

సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జయరాం తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌  కార్యదర్శి జయరాం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలుంటాయన్నారు. పోటీల్లో  ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు.

జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్‌ 10 నుంచి 12వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో జరిగే 2వ అంతర్‌ జిల్లా సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు  9885174178 నంబర్లో సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement