district team elect
-
సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జయరాం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలుంటాయన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో జరిగే 2వ అంతర్ జిల్లా సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 9885174178 నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఫెన్సింగ్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక స్థానిక ఇండోర్ స్టేడియం ఆవరణలో మంగళవారం నిర్వహించచినట్లట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు అంజయ్యలు తెలిపారు. జిల్లా క్రీడాభివద్ధి అధికారి బాషామోíß ద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అండర్–14, 17 బాల, బాలికల జిల్లా జట్ల ఎంపిక జరిగిందన్నారు. ఎంపికైన జట్లు కడపలో జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పాల్గొంటాయని తెలిపారు.