'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు' | sandra is also main accused in vote for crores scam | Sakshi
Sakshi News home page

'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు'

Jul 13 2015 1:16 PM | Updated on Aug 17 2018 12:56 PM

'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు' - Sakshi

'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు'

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే... సండ్రకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్య ప్రధాన సూత్రధారుల్లో ఒకరని, ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సండ్ర పాత్ర బయటపడిందని, కేసు కీలక దశలో ఉందని, దర్యాప్తు సంస్థకు సరైనంత సమయం ఇవ్వాలని, కేసులో సూత్రధారి సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని, దర్యాప్తుకు ఏమాత్రం సహకరించకుండా సండ్ర తప్పించుకుని తిరిగారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement