పిడుగురాళ్లలో భారీ చోరీ | Robbery in Piduguralla | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో భారీ చోరీ

Sep 11 2016 10:38 AM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

పిడుగురాళ్ల (గుంటూరు) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, రూ. 40 వేల విలువైన ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement