మృతుడి బంధువుల ఆందోళన | relations hesitate on road | Sakshi
Sakshi News home page

మృతుడి బంధువుల ఆందోళన

Sep 1 2016 11:38 PM | Updated on Aug 30 2018 4:07 PM

మృతుడి బంధువుల ఆందోళన - Sakshi

మృతుడి బంధువుల ఆందోళన

హైదరాబాద్‌ – నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎస్కార్ట్‌ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన జంగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాష్ట్ర రహదారిపై కుర్మేడ్‌ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

చింతపల్లి : హైదరాబాద్‌ – నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎస్కార్ట్‌ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన జంగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాష్ట్ర రహదారిపై కుర్మేడ్‌ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీ కొనడంతో మృతి చెందిన జంగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, చింతపల్లి, మర్రిగూడ, నాంపల్లి ఎస్‌ఐలు సంఘటన స్థలానికి చేరుకుని బంధువులకు నచ్చజెప్పారు. అనంతరం జంగయ్య అంత్యక్రియలు పోలీస్‌ పహారా మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా గ్రామంలో కొనసాగాయి. ఆయన అంత్యక్రియలకు చింతపల్లి ఎస్‌ఐ నాగభూషణ్‌రావు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్‌ కూడా త్వరలో అందించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement