ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి | Prajavani | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి

Oct 18 2016 4:10 PM | Updated on Sep 4 2017 5:36 PM

ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి

ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి

జిల్లా రెండుగా విడిపోయినా ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాౖటెనా ఫిర్యాదుల సంఖ్య మారలేదు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 84 ఫిర్యాదులు నమోదయ్యాయి. కలెక్టర్‌ యోగితారాణా, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, డీఆర్వో

జిల్లా రెండుగా విడిపోయినా ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాౖటెనా ఫిర్యాదుల సంఖ్య మారలేదు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 84 ఫిర్యాదులు నమోదయ్యాయి. కలెక్టర్‌ యోగితారాణా, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు తరలివచ్చే వారు. అయితే, జిల్లాల పునర్విభజనలో భాగంగా కామారెడ్డి కొత్తగా జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఫిర్యాదులు తగ్గే అవకాశముందని భావించారు. కానీ, ఎప్పట్లాగే ఈసారి కూడా కలెక్టరేట్‌కు వచ్చే వారి తాకిడి ఏమాత్రం తగ్గలేదు.
                                                                                                                                                                                                                                –  ఇందూరు 

Advertisement
 
Advertisement
Advertisement