ప్రతి షాపులో పీఓఎస్‌ మెషీన్లు వాడాలి | pos meshine | Sakshi
Sakshi News home page

ప్రతి షాపులో పీఓఎస్‌ మెషీన్లు వాడాలి

Nov 17 2016 10:44 PM | Updated on Mar 21 2019 8:35 PM

ప్రతి షాపులో పీఓఎస్‌ మెషీన్లు వాడాలి - Sakshi

ప్రతి షాపులో పీఓఎస్‌ మెషీన్లు వాడాలి

పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు సమస్య పరిష్కారానికి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు, షాపుల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్లు (పీవోఎస్‌) ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. నగదు రహిత వ్యాపార లావాదేవీలపై చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ప్రైవేటు ఆçస్పత్రులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

  •  
  • డెబిట్‌ కార్డుల జారీకి బ్యాంకుల చర్యలు
  • వ్యాపార సంస్థల ప్రతినిధుల 
  • సమావేశంలో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
  • కాకినాడ సిటీ :
    పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు సమస్య పరిష్కారానికి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు, షాపుల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్లు (పీవోఎస్‌) ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. నగదు రహిత వ్యాపార లావాదేవీలపై చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ప్రైవేటు ఆçస్పత్రులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ  పెద్ద నోట్ల రద్దు, చిన్న నోట్ల లేమి వల్ల నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన వ్యాపారులను కోరారు. జిల్లాలోని అన్ని రకాల షాపులలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు స్వైపింగ్‌ ద్వారా చిన్న మొత్తాల్లో కూడా కొనుగోలు జరిగే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఈ పీఓఎస్‌ మెషీన్లు ఉంచాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 2500 మెషీన్లు వివిధ వ్యాపారుల వద్ద ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకూ వినియోగంలో లేవని, వీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, ఇతర వ్యాపారులు కూడా వాటిని పొంది వ్యాపార లావాదేవీలు చేయాలన్నారు. వ్యాపారులకు పీఓఎస్‌ మెషీన్లను నామమాత్రం చార్జీలతో సరఫరా చేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, ఏక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సిద్ధంగా ఉన్నందున వాటిని వినియోగించాలన్నారు. వీటి ద్వారా జరిపే లావాదేవీలపై విధించే సర్వీసు టాక్సు వచ్చే ఆరు నెలల పాటు రద్దు చేయాలని, ప్రభుత్వాన్ని కోరామని దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి  ఉందన్నారు. రైతుబజార్లు, రేషన్‌ షాపుల్లో కూడా ఈ మిషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖలకు కలెక్టర్‌ సూచించారు. జేసీ ఎస్‌.సత్యనారాయణ, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, ఎస్‌బీఐ ఆర్‌ఎం డీఎస్‌ఆర్‌కే సాయిబాబు, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement