మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య | person suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Aug 4 2016 1:05 AM | Updated on Nov 6 2018 7:56 PM

వంగూరు(పెదవేగి రూరల్‌) : దీర్ఘకాలిక వ్యాధి బాధిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వంగూరు(పెదవేగి రూరల్‌) : దీర్ఘకాలిక వ్యాధి బాధిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం  ప్రకారం.. పెదవేగి మండలం వంగూరుకు చెందిన బొల్లి శ్రీనివాసరావు(45) కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాడు.  ఆరేళ్ల కిందట అతని భార్య కూడా అతని నుంచి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. వ్యాధి రోజురోజుకూ కుంగదీస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాఘవరావు చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement