పింఛన్ల గడువు పొడిగింపు | pension last date extension | Sakshi
Sakshi News home page

పింఛన్ల గడువు పొడిగింపు

Feb 5 2017 11:11 PM | Updated on Sep 5 2017 2:58 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ సమస్య తలెత్తడంతో గడువును రెండ్రోజులు పెంచుతున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

అనంతపురం టౌన్‌ : ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ సమస్య తలెత్తడంతో గడువును రెండ్రోజులు పెంచుతున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి నెలా 5వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి 7వ తేదీ వరకు పంపిణీ చేస్తామన్నారు. పింఛన్ల పంపిణీ అధికారులు లబ్ధిదారులందరికీ నగదు పంపిణీని వేగవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement