చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి | one killed in road accident in guntur district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి

May 15 2016 8:45 AM | Updated on Aug 30 2018 4:07 PM

గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది.

గుంటూరు : గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో  వినుకొండకు చెందిన అపరాల వ్యాపారి దేశు నాగేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement