బైక్‌ను ఢీకొన్న కారు | One killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు

Nov 27 2016 11:55 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు రూరల్‌ : వేగంగా వస్తున్న కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో బంగారు వ్యాపారి మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.

  •  బంగారు వ్యాపారి మృతి 
  • నెల్లూరు రూరల్‌ : వేగంగా వస్తున్న కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో బంగారు వ్యాపారి మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని పెద్దబజార్‌కు చెందిన బంగారు వ్యాపారి కేజర్ల బద్రీనాథ్‌ (61) సొంత పనుల నిమిత్తం గూడూరుకు బైక్‌పై బయలు దేరాడు. నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను వెనుక వైపు ఢీకొంది. దీంతో కింద పడిన బద్రీనాథ్‌ తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ బాలకోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
     
     

Advertisement
 
Advertisement
Advertisement