రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు | one injured in an accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Dec 16 2016 12:33 AM | Updated on Apr 3 2019 7:53 PM

మండలంలోని బసినేపల్లి శివార్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన షేక్‌ బాషా అనే స్లైక్లిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్‌ఐ వాహనమే ఢీకొట్టిందని బంధువుల ఆరోపణ
గుత్తి రూరల్‌: మండలంలోని బసినేపల్లి శివార్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన షేక్‌ బాషా అనే స్లైక్లిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివార్లలోని సిమెంట్‌ స్తంభాల తయారీ పరిశ్రమలో కూలీ పనికి వెళ్లే బాషా మధ్యాహ్నం భోజనానికి సైకిల్‌పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో గుత్తి వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బాషా సైకిల్‌ను వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో సైకిల్‌ నుజ్జునుజ్జైంది. బాసా ఎగిలి అల్లంత దూరంలో పడ్డాడు.

రక్తస్రావమై తీవ్రంగా గాయపడ్డ బాషాను అటుగా వెళ్తున్న కర్నూలు జిల్లా ఎస్‌ఐ శంకర్‌ తన జీపులోనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కాగా ఎస్‌ఐ శంకర్‌ వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి తెలిపారు. పంచాయితీ అనంతరం బాషా చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ఎస్‌ఐ భరించేలా మాట్లాడుకొన్నట్లు తెలిసింది. ఆ తరువాత అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఆ తరువాత బాధితులు మాటమార్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శంకర్‌ గుత్తిలో నివాసముంటూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంతానికి వాడుకుంటూ రోజూ జొన్నగిరి నుంచి గుత్తికి వచ్చి వెళ్తుంటాడని తెలిసింది.

ఈ విషయంపై ఎస్‌ఐ శంకర్‌ను ఫో¯ŒSలో ‘సాక్షి’ వివరణ కోరగా... బాషాను తన ముందు వెళ్తున్న లారీ ఢీ కొట్టి వెళ్తే వెనుకనే వచ్చిన తాను మానవత్వంతో అతడిని ఆస్పత్రికి చేర్చానన్నారు. తన వాహనమే ఢీకొట్టినట్లు బాషా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు భావించారని వివరించారు. బాధితుడు కూడా కోలుకున్నాక లారీ ఢీకొట్టినట్టు చెప్పాడని ఎస్‌ఐ తెలిపారు. గుత్తి ఎస్‌ఐ చాంద్‌బాషా వివరణ అడగ్గా.. బాషాను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఎగిరి ముందు వస్తున్న ఎస్‌ఐ జీపుపై పడ్డాడని చెప్పారు. ఎస్‌ఐ జీపు ఢీ కొట్టలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement