12న జాతీయ లోక్‌ అదాలత్‌ | national lok adalath on 12th | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 8 2016 5:07 PM | Updated on Sep 4 2017 7:33 PM

జిల్లాలోని కోర్టులున్న అన్ని చోట్ల జాతీయలోక్‌ అదాలత్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.తుకారాంజీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు(సెంట్రల్‌): జిల్లాలోని కోర్టులున్న  అన్ని చోట్ల జాతీయలోక్‌ అదాలత్‌ను  ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఎన్‌.తుకారాంజీ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, బ్యాంకు బుణాలు, టెలిఫోన్‌ బకాయిలు వాహన సంబంధ కేసులు చట్ట ప్రకారం రాజీ చేసుకొదగిన అన్ని రకాల కేసులను  పరిష్కరించడం జరుగుతుందని, కేసుల రాజీ పరిష్కరానికి గాను  కక్షిదారులు తగిన సూచనలు, సహకారం నిమిత్తం సంబంధిత కోర్టులు, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల సిబ్బందిని సంప్రదించి, కేసులను సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వినియోగించాలని తుకారాంజీ కోరారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement