వర్షానికి పలు ఇళ్లు ధ్వంసం | many houses destroyed with rains | Sakshi
Sakshi News home page

వర్షానికి పలు ఇళ్లు ధ్వంసం

Sep 11 2016 9:51 PM | Updated on Sep 4 2017 1:06 PM

దోబీగల్లిలో కూలిన ఇంటిని పరిశీలిస్తున్న కౌన్సిలర్‌ వేణుగోపాల్‌రెడ్డి

దోబీగల్లిలో కూలిన ఇంటిని పరిశీలిస్తున్న కౌన్సిలర్‌ వేణుగోపాల్‌రెడ్డి

సిద్దిపేటలో గత 24 గంటలుగా కురిసిన వర్షంతో పలు ఇళ్లకు నష్టం వాటిల్లగా, పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

సిద్దిపేట జోన్‌: సిద్దిపేటలో గత 24 గంటలుగా కురిసిన వర్షంతో పలు  ఇళ్లకు నష్టం వాటిల్లగా, పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శనివారం సాయంత్రం నుంచి  ఆదివారం తెల్లవారు జాము వరకు ముసుర్లతో కురిసిన వర్షంతో ఇమాంబాద్‌లో 3 ఇళ్లు, లింగారెడ్డిపల్లిలో 2, సిద్దిపేట పట్టణంలోని దోబీగల్లిలో 2 ఇళ్లు మొత్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఏడు ఇళ్లకు నష్టం వాటిల్లింది.

దోబీగల్లిలోని అంతగిరి కనుకయ్య ఇల్లు  ఆదివారం రాత్రి కూలిపోవడంతో వార్డు కౌన్సిలర్‌ వేణుగోపాల్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి గృహాన్ని పరిశీలించారు. అదే విధంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన శ్రీనివాస్‌నగర్‌లో వర్షపు నీరుతో కాలనీలు జలాశయాలుగా మారాయి. అపార్ట్‌మెంట్లలోని సెల్లార్‌లు అన్నీ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement