మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు | malladi vishnu get bail | Sakshi
Sakshi News home page

మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు

Jan 22 2016 12:59 PM | Updated on Sep 3 2017 4:07 PM

మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు

మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు

కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన కేసులో విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

విజయవాడ :  కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన కేసులో విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయన సోదరుడు మల్లాది శ్రీనివాస్కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు కింద రూ. 50 వేలు చెల్లించాలని కోర్టు వారిద్దరిని ఆదేశించింది. వారంలో మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్కి హాజరుకావాలని కోర్టు తెలిపింది. అలాగే విచారణ నేపథ్యంలో సిట్ బృందానికి సహకరించాలని మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడికి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు విజ్ఞప్తి చేసింది.  


 

Advertisement
 
Advertisement
Advertisement