vijayawada city congress president
-
మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు
విజయవాడ : కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన కేసులో విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు కింద రూ. 50 వేలు చెల్లించాలని కోర్టు వారిద్దరిని ఆదేశించింది. వారంలో మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌కి హాజరుకావాలని కోర్టు తెలిపింది. అలాగే విచారణ నేపథ్యంలో సిట్ బృందానికి సహకరించాలని మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడికి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు విజ్ఞప్తి చేసింది. -
మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్
విజయవాడ : కల్తీ మద్యం కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్‌కి విజయవాడ కోర్టు 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుమందు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లాది విష్ణుతోపాటు శ్రీనివాస్‌కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ క్రమంలో వారిద్దరి నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.