మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్ | Malladi vishnu remand in january 19, 2016, says city court | Sakshi
Sakshi News home page

మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్

Jan 8 2016 6:31 PM | Updated on Sep 3 2017 3:19 PM

మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్

మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్

కల్తీ మద్యం కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్కి విజయవాడ కోర్టు 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

విజయవాడ : కల్తీ మద్యం కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్కి విజయవాడ కోర్టు 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన విజయవాడ నగర  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

అంతకుమందు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లాది విష్ణుతోపాటు శ్రీనివాస్కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు.  ఆ క్రమంలో వారిద్దరి నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు.  నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement