ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ | Lorries collide: four injured | Sakshi
Sakshi News home page

ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ

Sep 22 2016 1:22 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ - Sakshi

ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ

చిల్లకూరు : ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ మినీ లారీ వేగంగా వచ్చి వెనుక వైపు ఢీకొనడంతో లారీలోని ఓ వ్యక్తితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.

 
  •  నలుగురికి గాయాలు 
చిల్లకూరు : ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ మినీ లారీ వేగంగా వచ్చి వెనుక వైపు  ఢీకొనడంతో లారీలోని ఓ వ్యక్తితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు గూడూరు డిపోకి చెందిన బస్సు ముత్తుకూరుకు వెళ్తుంది. నాంచారమ్మపేట వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిలవగా అదే సమయంలో బెస్తపాళెంలోని రొయ్యల గుంతల వద్దకు ఐస్‌ తీసుకెళ్తుతున్న మినీలారీ వేగంగా వచ్చి బస్సును వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణాపురం గిరిజన కాలనీకి  చెందిన విద్యార్థులు శ్రావణి, వినీత, అనూష ముందుకు పడి గాపడ్డారు. లారీలో ఉన్న పోలయ్య గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 సిబ్బంది గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement