మద్యం లోడు లారీ బోల్తా.. | liquor lorry road accident at Puttur | Sakshi
Sakshi News home page

మద్యం లోడు లారీ బోల్తా..

Jan 3 2017 5:13 PM | Updated on Aug 30 2018 4:10 PM

చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం లారీ బోల్తా పడిపోయింది

పుత్తూరు(చిత్తూరు): చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం లారీ బోల్తా పడిపోయింది. వడమాలపేటకు చెందిన మద్యం వ్యాపారుల లారీ మంగళవారం మధ్యాహ్నం విజయపురి వైపు వైన్‌ లోడుతో బయలుదేరింది. ఆ వాహనం పుత్తూరు బైపాస్‌ రోడ్డులో మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. దీంతో లారీలోని మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డాడు.

ఇది తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, డ్రైవర్‌ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, యజమానులు గ్రామస్తులను నిలువరించారు. పగిలిపోయిన బాటిళ్లను పక్కకు పడేసి, సురక్షితంగా ఉన్న సరుకును మరో వాహనంలో తరలించుకుపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement