డిసెంబర్‌ రెండో వారంలోకందనవోలు సంబరాలు | kandanavolu festival in december | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ రెండో వారంలోకందనవోలు సంబరాలు

Nov 17 2016 12:36 AM | Updated on Oct 1 2018 6:33 PM

కందనవోలు సంబరాలు డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

 – 10, 11 తేదీల్లో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహణ
కర్నూలు(అగ్రికల్చర్‌) : కందనవోలు సంబరాలు డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన చాంబర్‌లో కందనవోలు సంబరాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా కార్తీక మాసం ముగిసేలోపు కందనవోలు సంబరాలను నిర్వహించాలని నిర్ణయించగా..తాజాగా డిసెంబర్‌ 10, 11 తేదీల్లో నిర్వహించే విధంగా తాత్కాలికంగా జేసీ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించింది. ఈ ఉత్సవాలను ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబును ఆదేశించారు. పూర్తి స్థాయి ప్రణాళికను తయారు చేయాలని కమిటీ ప్రతినిధులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ డీవీఎం బాబ్జీ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement