డయేరియాతో ఇంటర్‌ విద్యార్థిని మృతి | inter student dead with diaria | Sakshi
Sakshi News home page

డయేరియాతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

Jul 22 2016 12:46 AM | Updated on Sep 28 2018 3:41 PM

లక్ష్మీకుమారి (ఫైల్‌ఫొటో) - Sakshi

లక్ష్మీకుమారి (ఫైల్‌ఫొటో)

గొర్రిబంద గ్రామానికి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థిని లక్ష్మీ కుమారి(16) డయేరియాతో బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసింది.

గొర్రిబంద(సారవకోట): గొర్రిబంద గ్రామానికి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థిని లక్ష్మీ కుమారి(16) డయేరియాతో బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసింది. తొలుత స్థానిక పీహెచ్‌సీలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో శ్రీకాకుళం తరలించి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. లక్ష్మీకుమారి సారవకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివేది. ఈమె చనిపోయినట్టు తెలుసుకున్న యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది.  

Advertisement
 
Advertisement
Advertisement