diaria
-
‘డయేరియాతో ప్రజలు చనిపోతే.. అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా?’
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్బంగా డయేరియా మరణాలను దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజారోగ్యం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి తాగు నీరు ఇవ్వలేరా? అని మండిపడ్డారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతం దమ్మల వీధిలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు.. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘డయేరియా మరణాలను ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అన్ని రంగాలను వదిలేసి డబ్బులన్నీ రాజధాని పేరుతో అమరావతిలో పెడుతున్నారు. శ్రీకాకుళం ఆసుపత్రిలో ఒక్క ట్యాబ్లెట్ కూడా లేదు. ఏమీ లేకపోయినా ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు.రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ఏడుస్తున్నారు. రైతులను దళారీలు దో చేస్తున్నా అడిగేవాడే లేడు. గార మండలంలో ఇసుక తవ్వేస్తున్నారు. అక్కడ కూడా డయేరియా వచ్చే అవకాశం ఉంది. నీరు ఎర్రగా వస్తుంది.మున్సిపల్ కార్యాలయాన్ని ప్రైవేటు కార్యాలయంగా మార్చేశారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ డోర్‌కు అంటించడం కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి. కింది స్థాయి పరిపాలనా వ్యవస్థను గాలికి వదిలేశారు. వెనుకబడిన ప్రాంతాల హక్కులని ఈ ప్రభుత్వం తొక్కేస్తుంది. ప్రజలు వెంటాడి మరీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. ప్రజల ఆవేదన తీవ్ర రూపం దాల్చబోతుంది. నలుగురు చనిపోతే.. ఒక్కరే చనిపోయారని చెప్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మరణాలను దాస్తున్నారు. ప్రజల ఆగ్రహం చూడబోతున్నారు.. ఆరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేల్కొవాలి’ అని హితవు పలికారు. మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ..‘శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. నలుగురు చనిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్యం. డయేరియా ప్రబలిందని ఈ నెల 23వ తేదీన మీడియా చెబుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతిలో కబడ్డీ ఆడుకుంటున్నారు. నలుగురు చనిపోతే అది.. డయేరియా వలన కాదని ప్రభుత్వం తప్పించుకుంటుంది. మున్సిపల్ వాటర్ నీరా? విషమా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. ఇవి డయేరియా మరణాలు కాదు.. ప్రభుత్వం హత్యలుగా గుర్తించాలి. విజయనగరం, విజయవాడలో డయేరియా మరణాలు సంభవించాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్ ఎక్కడ?. అధికారులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పడకేసింది. తలుపు, తాళం వేసిన శాఖకు ఒక మంత్రి. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామని సీఎం చెబుతున్నారు. ముందు ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వండి. మృతుని కుటుంబ సభ్యులకి 25 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
విశాఖలో డయేరియా కలకలం.. చిన్నారి మృతి!
సాక్షి, విశాఖ: విశాఖపట్నం ఏపీలో చాప కింద నీరులో డయేరియా విస్తరిస్తోంది. విశాఖలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డయేరియాతో 41 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, డయేరియా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఓ చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం చోటుచేసుకుంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిల్లో చేరారు. వాంతులు, వీరోచనాలతో బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మంచి నీటి కొళాయి వద్ద మురుగు నీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్టు స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ..‘డయేరియా ప్రబలిన ప్రాంతంలొ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. 41 మంది డయేరియా బారిన పడ్డారు. గీతిక అనే బాలిక డయేరియాతో చనిపోయిందని నిర్ధారించలేం.. వేరే కారణం ఏదైనా అవ్వచ్చు. ఏడుగురు డయేరియా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డయేరియా బాధితులకు డయాలసిస్ అవుతుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. -
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
-
కలుషిత నీరు కలకలం
బెజ్జంకి(సిద్దిపేట) : కలుషిత నీరు తాగి మండలంలోని తోటపల్లిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వీరందరిని కరీంనగర్, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కొందరు గ్రామంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, బెజ్జంకిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందారు. ఇందులో 25 మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 20 మంది కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రి, ఇద్దరు ప్రతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి ఇద్దరిని తరలించగా రాజయ్య అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్ఓ.. వివరాలు తెలుసుకున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల ఆదేశాలతో గజ్వేల్ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిద్దిపేట డీఎంఅండ్‌హెచ్‌ఓ అమర్‌సింగ్ నాయక్, గడా హెల్త్ ప్రత్యేకాధికారి కాశీనాథ్ హుటాహుటిన గ్రామానికి వచ్చి చికిత్స పొదుతున్న రోగులను, గ్రామానికి నీరు సరఫరా చేసే బావిని పరిశీలించారు. జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, అధికారులు గ్రామంలో పర్యటించారు. నీటి సరఫరా నిలిపివేయించారు. ప్రతీ ఇంటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ జానకి, తహసీల్దార్ నాగజ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఈ సాయి, హుస్నాబాద్ వైద్యులు, రెవెన్యు సిబ్బంది, కార్యదర్శులు పర్యటించారు. గేట్‌వాల్వ్ వద్దే కలుషితం..? గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన మంచి నీటి పైప్‌కు ఉన్న గేట్ వాల్వ్ వద్ద కొన్ని రోజులు నీరు లీకవుతోందని స్థానికులు తెలిపారు. దానిని బాగు చేయకపోవడంతో అది ఓ మురుగు గుంతలా మారింది. అక్కడ కలుషితమైన నీరు పైపుల్లోకి వెళ్లడంతో గ్రామమంతా సరఫరా అయ్యాయన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. సరఫరా అయిన తాగునీటి నమూనాలను అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. క్లోరినేషన్ లేకపోవడంతోనే.. తాగు నీరు సరఫరా అయ్యే బావిలో క్లోరినేషన్ చేయకపోవడం, పైప్లైన్ల లీకేజీ కారణంగా నీరు కలుషితం అయి ఉంటుంది. ప్రజలు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. - అమర్‌సింగ్ నాయక్, డీఎంహెచ్ఓ ఆదివారం నుంచి వాంతులు.. ఆదివారం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మొదట బెజ్జంకిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన. మా ఊరిలోని ప్రభుత్వాస్పత్రిలో మందులు ఇస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి చేరిన. ఇప్పుడు కొంత నయంగా ఉంది. - ఎన్నం రాజేశ్వరి, తోటపల్లి -
గుంటూరు వాసులను వణికిస్తున్న డయేరియా
-
డయేరియాతో మహిళ మృతి
లావేరు : మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో గురువారం ఉదయం బాలి పాపమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. ఈమె రెండు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. క్యాన్సర్ వ్యాధితో పాటు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రంతా వాంతులు, విరేచనాలు ఎక్కువ అయ్యాయి. వాంతులు, విరేచనాలు అయిన ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యులు వద్దకు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి వైద్యసేవలు అందజేశారు. వాంతులు విరేచనాలు ఎక్కువ కావడం వల్ల ఆమె డీహైడ్రేషన్‌కు గురై గురువారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందింది. మృతురాలికి ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తల్లి డయేరియా వ్యాధితో మరణించడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదిలా ఉండగా గ్రామంలో మీసాల మహలక్ష్మీ, అదపాక సూరీ అనే వ్యక్తులతో పాటు పలువురు డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరిని వైద్య సేవల కోసం కొండములగాంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తరలించారు. గ్రామాన్ని సందర్శించిన సీహెచ్‌వో వేణుగోపాలపురంలో బాలి పాపమ్మ అనే మహిళ డయేరియాతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లావేరు పీహెచ్సీ సీహెచ్‌వో రాజగోపాలరావు గురువారం గ్రామానికి వెళ్లి మృతురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంకా ఎవరికైనా డయేరియా వ్యాధితో బాధపడుతున్నారా, ఉంటే వారికి వైద్యసేవలు అందించాలని స్థానిక ఏఎన్ఎంకు సూచించారు. ఏఎన్ఎం బి.అరుణకుమారి, ఆశ కార్యకర్తలు గురువారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి డయేరియా వ్యాధితో బాధపడుతున్న రోగులు వివరాలు సేకరించి వైద్యసేవలు అందజేశారు. -
డయేరియాతో ఇంటర్ విద్యార్థిని మృతి
గొర్రిబంద(సారవకోట): గొర్రిబంద గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని లక్ష్మీ కుమారి(16) డయేరియాతో బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసింది. తొలుత స్థానిక పీహెచ్సీలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో శ్రీకాకుళం తరలించి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. లక్ష్మీకుమారి సారవకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేది. ఈమె చనిపోయినట్టు తెలుసుకున్న యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది.


