వీడియో తీసి బెదిరిస్తున్నాడు.. | Harassment on 'video' | Sakshi
Sakshi News home page

వీడియో తీసి బెదిరిస్తున్నాడు..

Sep 12 2016 9:18 PM | Updated on Sep 4 2017 1:13 PM

బాత్‌రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని సోమవారం ఓ మహిళ అడిషనల్‌ ఎస్పీకి మొరపెట్టుకుంది.

రూరల్‌ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఓ మహిళ ఫిర్యాదు
 
గుంటూరు ఈస్ట్‌: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని సోమవారం ఓ మహిళ అడిషనల్‌ ఎస్పీకి మొరపెట్టుకుంది.  జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ వై.టి.నాయుడుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. సత్తెనపల్లి నుంచి వృత్తిరీత్యా నరసరావుపేటకు వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు, పక్క పోర్షన్‌లో ఉండే వ్యక్తి తాను బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన అడిషనల్‌ ఎస్పీ ఆమెకు న్యాయం చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement