గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం | gudiwada amarnath indefinite fast is interrupted | Sakshi
Sakshi News home page

గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం

Apr 17 2016 10:56 PM | Updated on May 29 2018 4:23 PM

గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం - Sakshi

గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు.

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. ఆయన దీక్ష నేడు నాలుగో రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షా స్థలికి వస్తారని ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు దీక్షను భగ్నం చేశారని నేతలు ఆరోపిస్తున్నారు.

నేటి సాయంత్రాయానికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన బీపీ లెవెల్స్ తగ్గాయి. దీంతో దీక్ష చేస్తున్న నేత అమర్నాథ్ ను పోలీసులు కావాలనే హడావుడి చేసి ఆస్పత్రికి తరలించడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు.  మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement