breaking news
visakha special railway zone
-
గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. ఆయన దీక్ష నేడు నాలుగో రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షా స్థలికి వస్తారని ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు దీక్షను భగ్నం చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. నేటి సాయంత్రాయానికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన బీపీ లెవెల్స్ తగ్గాయి. దీంతో దీక్ష చేస్తున్న నేత అమర్నాథ్ ను పోలీసులు కావాలనే హడావుడి చేసి ఆస్పత్రికి తరలించడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. -
మూడోరోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ దీక్ష
విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన శనివారం ఉదయం రోడ్డు మీద స్నానం చేసి తన నిరసన తెలిపారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. కాగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... ప్రతిసారీ తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు. దీంతో రాష్ట్ర సమస్యలతో పాటు విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంపై పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ సీపీ ఎంపీలే.