ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు.
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
Jul 24 2016 12:17 AM | Updated on Sep 4 2017 5:54 AM
– డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రై వేట్ బిల్లును బీజేపీ సభ్యులు అడ్డుకుని వాయిదా వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కోల్స్ కాలేజీ సమీపంలోని మూడు రస్తాల కూడలిలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. హోదా సంజీవని కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కొంగజపం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, అశోకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Advertisement


